Siddapur వార్తలు
తాజా వార్త
✍️ Bathini Shekhar ✓
⏱️ 4 రోజుల క్రితం • 14 Oct 2026

సిద్ధాపూర్‌కు స్మశాన వాటిక కేటాయించాలి డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేత

సదాశివపేట పట్టణంలోని 7వ వార్డు సిద్ధాపూర్ గ్రామానికి స్మశాన వాటిక కేటాయించాలని కోరుతూ కౌన్సిలర్ విష్ణువర్ధన్ రెడ్డి గ్రామస్తులతో కలిసి డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో స్మశాన వాటిక లేకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి గ్రామానికి తగిన స్థలాన్ని కేటాయించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గొల్ల కృష్ణయ్య, గ్రామ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

#Siddapur 🏛️ మన సంగారెడ్డి ప్రత్యేక కథనం
WhatsApp లో మిత్రులకు షేర్ చేయండి
⬅ ప్రారంభం ఇదే మొదటి వార్త
తర్వాతి వార్త ➔ వెంకటపూర్‌లో ఘనంగా పోషణ మాసం కార్యక్రమం...