Sadashivpet News : ప్రస్తుత తరుణంలో విద్యార్థులకు చదువుతోనే సంస్కారమని ఉజ్వల కళాశాల ప్రిన్సిపాల్ కూచి శ్రీనివాస్ అన్నారు. శనివారం పట్టణంలోని ఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ప్రెషర్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విద్యార్థులకు విద్యతోనే విలువలు పెరుగుతాయని కష్టపడి ఇష్టపడి చదివి ఉన్నత స్థాయి ర్యాంకులు సాధించాలన్నారు. సమాజంలో సెల్ఫోన్ భూతానికి అలవాటు పడి తమ విలువైన జీవితాన్ని వృధా చేసుకుంటున్నారని. సెల్ఫోన్ అవసరం ఉన్నప్పుడే వాడాలని. చాటింగులు. ఇంస్టాగ్రాములు. సోషల్ మీడియా వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. అదే విధంగా విద్యార్థులు చెడు వ్యసనాలైన గుట్కా సిగరెట్. మద్యపానం. డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు అలవాటు పడొద్దు అన్నారు. అదేవిధంగా విద్యార్థుల పైన ర్యాగింగ్ చేయొద్దన్నారు. తమ విలువైన కాలాన్ని చదువుపై దృష్టి పెట్టి కష్టపడి చదివినట్లయితే మీ తల్లిదండ్రులు చదువులు నేర్పిన కళాశాల అధ్యాపకులకు గుర్తింపు వస్తుందన్నారు. ఉన్నత స్థాయి ర్యాంకులు సాధించే దిశగా లక్ష్యాన్ని పెట్టుకోవాలన్నారు. చదువుతోనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. అనంతరం మంచు మార్కులు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు అతిథుల చేతుల మీదగా మెమొంటోతో పాటు ప్రశంస పత్రాలు అందజేశారు. పార్టీలో విద్యార్థినీ విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు. డీజే ఆటపాటల ద్వారా పార్టీని ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అమరేందర్ రెడ్డి .డైరెక్టర్స్ రఘు వర్ధన్ రెడ్డి. అధ్యాపకులు సునీత. ప్రియాంక. వరలక్ష్మి. జీవిత. స్వాతి. లావణ్య. గంగయ్య. నరేష్. సమీర్. నవాబ్. సంగమేశ్వర్ రెడ్డి. మరియు పూర్వ విద్యార్థులు. విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
