14/04/2026

Sangareddy News : సంగారెడ్డి కలెక్టరేట్లో ఘనంగా రెండవ రోజు బతుకమ్మ పండుగ సంబరాలు. తెలంగాణ మహిళల సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక గా నిలుస్తుంది అని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో జిల్లా విద్యాశాఖ , ఇంటర్ ఇంటర్మీడియట్ విద్యాశాఖ ల ఆధ్వర్యంలో రెండవ రోజు బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహించారు . ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రావీణ్య మాట్లాడారు. తెలంగాణ మహిళల ఆత్మీయత, ఆధ్యాత్మికత, సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక గా నిలుస్తుంది అన్నారు. ప్రకృతిని దైవంగా పూజించి పండుగగా బతుకమ్మ పండుగ అన్నారు. ఇలాంటి పండుగలను నిర్వహించడం ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలుపవచ్చు అన్నారు. భావి తరాల కు చెందిన పిల్లలకు సంస్కృతి , సాంప్రదాయాలతో పాటు విలువలను కూడా తెలపడం ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ,మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడి , పాటలు పాడి బతుకమ్మ పండుగ సంబరాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ ఉపాధ్యాయులు ఉద్యోగులు విద్యాశాఖ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బతుకమ్మ ఆటపాటలతో కలెక్టరేట్ ప్రాంగణం సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సాంప్రదాయ వేషధారణలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, డి ఐ ఈ ఓ గోవింద్ రామ్ ,cఉపాధ్యాయులు ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *