18/02/2026
Sangareddy Police paying tributes to Telangana freedom fighter Chakali Ilamma on her 130th Jayanti celebrations

Sangareddy News : తెలంగాణ వీరవనిత, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 130 జయంతి వేడుకలను ఈరోజు సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు, అధికారులు, సిబ్బంది జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఐలమ్మ చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు.

అనంతరం, ఎస్పీ గారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ చూపిన ధైర్యసాహసాలు, ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని, భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ ఆస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ డియస్పి నరేందర్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఆర్ఐ. లు రామారావ్, రాజశేఖర్ రెడ్డి, ఇన్స్పెక్టర్స్ నాగేశ్వర్ రావ్, డీపీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *