14/04/2026

Sangareddy News : సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఎల్లారం గ్రామానికి చెందిన బ్లడ్ డోనర్స్ క్లబ్ అధ్యక్షుడు రవి మిత్రుడి వాళ్ళ నాన్నకి రక్తం తక్కువగా ఉండడం వలన సంగారెడ్డి ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు… వైద్యులు పరీక్షించి రక్తం కావాలి అన్నారు… దీంతో కుటుంబ సభ్యులు ఆత్మకూర్ బ్లడ్ డోనర్స్ క్లబ్ అధ్యక్షుడు తమ్మలి రవి నీ సంప్రదించడం జరిగింది…. వెంటనే ఆత్మకూర్ గ్రామానికి చెందిన అరెకటికే రోషన్ కల్లపల్లి రాజ శేఖర్ ను సంప్రదించారు….రక్త దాతలు రక్త దానం చేస్తాను అని వెంటనే సంగారెడ్డి బాలాజీ హాస్పిటల్ కి వెళ్లి రక్త దానం చేసి ప్రాణ దాత గా నిలిచారు…రోషన్ కల్లపల్లి రాజ శేఖర్ ను ఆదర్శంగా తీసుకుని యువకులు రక్త దానం చేయడానికి ముందుకు రావాలి అని ఆత్మకూర్ బ్లడ్ డోనర్స్ క్లబ్ తరుపున కోరడం జరుగుతుంది…రక్త దాతలు మాట్లాడుతూ రక్త దానం ప్రాణ దానం తో సమానం అన్నారు… చాలా మంది రక్త దానం చేస్తే ఎక్కడ బలహీన పడుతము అని అనుకుంటారు.. కానీ…ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ.. మూడు నెలలకు ఒక్కసారి రక్త దానం చేస్తే మరింత ఆరోగ్యంగా ఉంటారు……రక్త దానం చేసి ప్రాణ దాత గా నిలిచిన వారికి ఆత్మకూర్ బ్లడ్ డోనర్స్ క్లబ్ తరుపున అభినందించడం జరిగింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *