18/02/2026
Sangareddy District Police Monthly Crime Review meeting led by SP Paritosh Pankaj IPS with officers discussing investigation efficiency, pending cases, and community policing.

Sangareddy News : మంత్లీ క్రైమ్ రివ్యు మీటింగ్ లో భాగంగా ఈ రోజు తేది: 23.09.2025 నాడు సంగారెడ్డి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. గారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. జిల్లాలో పోలీసుల పనితీరుపై ప్రజాబిప్రాయ సేకరణ (పౌర సేవలు, పర్యవేక్షణ), దర్యాప్తు సామర్థ్యాన్ని పెంచేందుకు సాంకేతికత వినియోగం వంటి 2-వర్టికల్ విభాగాలలో సంగారెడ్డి జిల్లా మెరుగైన ప్రదర్శన చూపడం జరిగిందని, అందుకు కృషి చేసిన జిల్లా పోలీసు అధికారులను, సిబ్బంది ఎస్పీ గారు అభినందించారు. ఇదే ఉత్సాహం మునుముందు కూడా కొనసాగించి, అన్ని వర్టికల్ విభాగాలలో జిల్లాను ముందు వరుసలో నిలపాలని సూచించడం జరిగింది.
అండర్-ఇన్వెస్టిగేషన్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, మిస్సింగ్ మరియు ఎబ్.బి.డబ్ల్యూ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ లో వేగం పెంచాలని, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో ఏవైనా సందేహాలు ఉంటే ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ సేవలను వినియోగించుకొని, నివృత్తి చేసుకోవాలని అన్నారు. లాంగ్ పెండింగ్ కేసులు, ఎన్.బి.డబ్ల్యూ ఎగ్జిక్యూషన్ కొరకు సబ్-డివిజన్ పరిదిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పెండెన్సీ తగ్గించాలన్నారు.
ఎస్.హెచ్.ఓ లు తమ ఏరియాలో గల ప్రతి గ్రామాన్ని సందర్శించి, ఆయా ప్రాంతాలలో గల సమస్యలను తెలుసుకోవాలని అన్నారు. విలేజ్ పోలీసు అధికారులు తమకు కేటాయించిన గ్రామలపై పూర్తి అవగాహన కలిగి, ముందస్తు సమాచారాన్ని సేకరించాలని, రౌడీ షీటర్స్, సస్పెక్ట్ ల కదళికలై నిఘా ఉంచాలని అన్నారు. బ్లూకోల్ట్స్ మరియు నైట్ పెట్రోలింగ్ సిబ్బంది “ఫింగర్ప్రింట్ డివైస్” లను వినియోగిస్తూ.. అనుమానాస్పద వ్యక్తుల ఫింగర్ ప్రింట్స్ సేకరించాలన్నారు.
ఆన్లైన్ మోసాలపై సోషల్ మీడియా, పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టమ్ ద్వారా మరియు కమ్యూనిటి పోలిసింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. గుర్తు తెలియని నెంబర్ల నుండి కాల్స్, వీడియో కాల్స్ చేస్తూ, పోలీస్ అధికారులం అంటే నమ్మరాదని, డిజిటల్ అరెస్ట్ లు ఉండవని గుర్తించాలన్నారు. ఆన్లైన్ లో అపరిచితులతో పరిచయాలకు దూరంగా ఉండాలని ఆన్లైన్ మోసాల గురించి అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్లైన్ మోసాలకు గురి అయినట్లైతే మొదటి గంట (Golden Hour) లోపు 1930కు కాల్ చేసి లేదా యన్.సి.ఆర్.పి. https://www.cybercrime.gov.in/ పోర్టల్ నందు నమోదు ఫిర్యాదు నమోదు చేయాలని అన్నారు.
సిసి కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ అన్నీ కుల మతాలకు చెందిన పవిత్ర స్థలాలలో మరియు పరిశ్రమలలో తదితర ముఖ్యమైన ప్రాంతాలలో కమ్మునిటీ సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా, ఇంటి రక్షణకై ఏర్పాటు చేసుకున్న సిసి కెమెరాలలో ప్రజలకు ఉపయోగపడే, వీధి రోడ్డుకు ఉన్న కెమెరాలను నేను సైతం కెమెరాలుగా జియో ట్యాగ్ చేయించే విధంగా వివిధ సంఘాల పెద్దలకు అవగాహన కల్పించాలని యస్.హెచ్.ఒ లకు సూచనలు చేశారు.
అనంతరం యస్.హెచ్.ఓ వాహనాలను తనిఖీ చేస్తూ. ప్రతి వెహికిల్ ను రెగ్యులర్ సర్వీస్ చేయిస్తూ, ఎలాంటి రిపేర్స్ లేకుండా పూర్తి కండిషన్ లో ఉండే విధంగా చూసుకోవాలని డ్రైవరులకు సూచించారు. ఈ వాహనాల తనిఖీలలో ఎఆర్ డియస్పీ నరేందర్, వెహికిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, అడ్మిన్ ఆర్.ఐ. రామారావ్ ఉన్నారు.
వివిధ విభాగాలల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులను, సిబ్బందిని ఎస్పీ గారు అభినందించి, రివార్డ్ లు, అప్రిసియేషన్ లను అందజేశారు.
ఈ సమీక్షా సమావేశంలో అదనపు.ఎస్పీ సిహెచ్. రఘునందన్ రావ్, డియస్పిలు సత్యయ్య గౌడ్, ప్రభాకర్, వెంకట్ రెడ్డి, సైదా నాయక్, సురేందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, ఇన్స్పెక్టర్స్ రమేష్, కిరణ్ కుమార్, నాగేశ్వర్ రావ్, సదా నాగరాజు, ప్రవీణ్ రెడ్డి, నాగేశ్వర్ రావ్, రవి మరియు జిల్లా ఇన్స్పెక్టర్స్, సబ్ఇన్స్పెక్టర్స్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *