Sadashivpet News : స్థానిక జీనియస్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో రాష్ట్ర పండుగ అయినటువంటి బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించినారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ICDS-CDPO శ్రీమతి చంద్రకళ గారు విచ్చేసి బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను మరియు పూల యొక్క ఔషధ గుణాలను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు చేసిన దాండియా నృత్యాలు మరియు బతుకమ్మ పాటలు అందర్నీ అలరించారు. ఈ కార్యక్రమంలో స్కూలు వైస్ చైర్మన్ కూచి శ్రీనివాస్, కరస్పాండెంట్ రఘువర్ధన్ రెడ్డి, డైరెక్టర్ అమరేందర్ రెడ్డి ప్రిన్సిపాల్ శ్రీమతి ప్రీతి ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
