14/04/2026

Sadashivpet News : సదాశివ్ పేట్ రావుస్ ఇంటర్నేషనల్ స్కూల్ లో శనివారం ఘనంగా బతుకమ్మ పండుగ వేడుకలు జరిపారు.విద్యార్థినీలు, మహిళా ఉపాధ్యాయులు, సాంప్రదాయ వస్త్రధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి అందంగా అలంకరించారు. బతుకమ్మ పాటలు పాడుతూ విద్యార్థినీలు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వీణాధారి, వైస్ ప్రిన్సిపల్ మంజుల మాట్లాడుతూ బతుకమ్మ పండుగ పర్యావరణాన్ని ఆదరించే పండుగ మరియు ఆచారానికి ప్రతిక అని అన్నారు. ఈ పండుగ తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే పండుగని అన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మానసిక ఉల్లాసంతో పాటు బతుకమ్మ విశిష్టతను విద్యార్థులకు తెలియజేయాలని ఉద్దేశంతోనే బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించామన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు సమాజం పట్ల అవగాహన కల్పించడం కూడా దీని ముఖ్య ఉద్దేశం అన్నారు. విద్యాసంస్థల్లో కులమతాలకు అతీతంగా పండుగలు జరుపుకుంటామని తెలిపారు. తమకు అన్ని విధాలుగా సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *