18/02/2026
సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పూలమాల అర్పిస్తున్న డిఎస్పీ సత్యయ్య గౌడ్ మరియు పోలీసు అధికారులు

Sangareddy News : సంగారెడ్డి జిల్లా, నవంబర్-23: ఈ రోజు సత్యసాయి బాబా శత జయంతి పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్టపర్తి సత్యసాయి బాబా చిత్రపటానికి డిఎస్పీ సత్యయ్య గౌడ్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఆర్.ఐ రామారావ్, సిబ్బంది పూలమాల వేసి, ఘననివాళులు అర్పించారు. సత్యసాయి బాబా సేవా భావం, సానుభూతి, మానవతా విలువలను స్మరించుకుంటూ జరిగిన ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఆర్.ఐ రామారావ్, కార్యాలయ సిబ్బంది, ఆర్మూడ్ రిజర్వ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *