Sangareddy News : స్థానిక సంస్థలను దృష్టిలో ఉంచుకొని, జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అక్కడి పరిస్థితిని సమీక్షించాలని, గత ఎన్నికలలో అల్లర్లు సృష్టించిన వారిని సత్ప్రవర్తన కోరుతూ.. ముందస్తుగా బౌండ్ ఓవర్ చేయాలన్నా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్.హెచ్.ఓ లు తమ, తమ ఏరియాలో గల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి, సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. అక్కడి పరిస్థితులను సమీక్షించడం జరిగింది. గత ఎన్నికలలో అల్లర్లు సృష్టించిన, హిస్టరీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది.
