14/04/2026
Untitled design (7)

Sadashivpet News : సదాశివపేట మండలంలో గల ఆత్మకూర్ లో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బూత్ అధ్యక్షులు ప్రశాంత్,కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కౌన్సిల్ సభ్యులు సుధాకర్ మాట్లాడుతూ ఏకాత్మ మానవ దర్శనం మూల సిద్ధాంతంతో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ,డాక్టర్ శామప్రసాద్ ముఖర్జీ,అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్ కే అద్వానీ గారి ఆశయాలతో పురుడు పోసుకున్న భారతీయ జనతా పార్టీ అంచలంచెలుగా ఎదుగుతూ భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో నే ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఎన్నికైన నాటినుండి నేటి వరకు ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు నోట్ల రద్దు వల్ల పాకిస్తాన్ ను ఆర్థికంగా దెబ్బతీయడం 370 ఆర్టికల్ ను తీసివేసి జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించడం ట్రిపుల్ తలాక్ ఎత్తివేసి ముస్లిం మహిళలకు రక్షణ కల్పించడం
బాబ్రీ మసీదు రామజన్మభూమి తగువు పై ప్రజల్లో అవగాహన కల్పించి ఆలయ నిర్మాణానికి మార్గాన్ని సుగమం చేయడం కోవిడ్ సంక్షోభంలో మన దేశంతో పాటు ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ అందించి ప్రజలను రక్షించుకోవడం గత ఏడు సంవత్సరాల నుండి ఉచిత రేషన్ బియ్యం ఇవ్వడం దేశవ్యాప్తంగా రైతులకు కిసాన్ సామ్మాన్ నిధి అందించడం ప్రతి సంవత్సరం మద్దతు ధరలు పెంచడం 2014లో భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాల్లో 11వ స్థానంలో ఉంటే 2025 నాటికి నాలుగో స్థానానికి తీసుకురావడం జాతీయ రహదారులను విస్తరించడం మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఆత్మ నిర్బర్ భారత్ స్టార్టప్ ఇండియా వంటి ఆర్థిక అభివృద్ధి సంస్కరణలు తీసుకువచ్చి దేశ దశను దిశను మార్చి సామాన్యుడికి ప్రభుత్వ పథకాలు అందేలా ముందుకు సాగుతుందని ప్రపంచ దేశాలలోనే అత్యధిక కార్యకర్తలు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని నరేంద్ర మోడీ ఆశయసాధన కోసం ప్రతి కార్యకర్త అహర్నిశలు కృషిచేసి ముందుకు సాగాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు గున్నాల బక్కన్న చాకలి రాములు యువ మోర్చా మండల మాజీ ఉపాధ్యక్షుడు మహిపాల్ మాజీ బూత్ అధ్యక్షుడు మనోహర్ చంద్రశేఖర్ కృష్ణ సువాస్ శ్రీకాంత్ కృపాకర్ ప్రవీణ్ కుమార్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *