Sadashivpet News : సదాశివపేట పట్టణంలోని స్థానిక చేనేత సహకార సంఘంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పట్టణ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు పద్మశాలి కుల నలుగురు కౌన్సిలర్ లకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సదాశివపేట పట్టణంలో పద్మశాలి కుల సంఘ భవన నిర్మాణం కోసం ల్యాండ్ అలాట్మెంట్ (భూమి కేటాయింపు) కల్పించేందుకు గౌరవ శ్రీ తూర్పు జగ్గారెడ్డి మరియు నిర్మల జగ్గారెడ్డి గారి సహకారంతో కృషి చేస్తానని హామీ ఇస్తూ, పట్టణ వైస్ చైర్ పర్సన్ శ్రీమతి రేణుక చిరంజీవి గారు రూ.1,00,000 (ఒక లక్ష రూపాయలు) ఆర్థిక సహాయం అందజేశారు.
అదే విధంగా, ఇండ్ల స్థలాలు లేని పద్మశాలి పేదలకు ప్రభుత్వ పరంగా ఇండ్ల స్థలాలు ఇప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీ అంజమ్మ సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే కౌన్సిలర్లు శ్రీమతి బిట్ల నికిత ప్రేమ్ గారు, శ్రీమతి ప్రియాంక పవన్ గారు, శ్రీ ఫణి క్రిష్ణ గారు, శ్రీమతి నాగుల మణెమ్మ విజయ్ గారు హాజరై తమ మద్దతు తెలిపారు.
ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిలుగా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షడు గుండు సత్యనారాయణ గారు, రాష్ట్ర యువజన అధ్యక్షుడు గంధమల్లె రాజు గారు, ఈ కార్యక్రమ సభాధ్యక్షులు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు శ్రీ మునిపల్లి విశ్వనాథం గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీ నక్క ప్రభాకర్ గారు, మార్కండేయ మందిరం చైర్మన్ లడ్డు (వెంకన్న) గారు, కుల సంఘం పెద్దలు గున్నాల సత్యం, చిలువేరి వెంకన్న, సిద్దాపురం రాములు, యెన్నం మల్లేశం, నాగారం గోపాల్, పోల సిద్దిరాములు, మాణిక్యం, జి.క్రిష్ణ, కొంగరి ప్రభు, నాగారం పెంటన్న, మద్దెల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పద్మశాలి సంఘ అభివృద్ధికి మరియు పేదల సంక్షేమానికి అందరూ కలిసి సహకరించాలని పిలుపునిచ్చారు. సంఘ ప్రతినిధులు విరాళం అందించినందుకు మరియు హామీలు ఇచ్చినందుకు వైస్ చైర్ పర్సన్ రేణుక చిరంజీవి గారికి కృతజ్ఞతలు తెలిపారు.
