14/04/2026

Sangareddy News : ఈనెల 17 నుండి వచ్చేనెల 16 వరకు జరగనున్న ఎనిమిదవ జాతీయ పోషణ అభియాన్ మాసం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రశేఖర్ అన్నారు. సోమవారం తన ఛాంబర్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులతో పోషణ అభియాన్ కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు.

      ఈ సందర్భంగా  అదనపు కలెక్టర్  మాట్లాడుతూ - ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వం పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గర్భిణీలు బాలింతలు, కిషోర్ బాలికలు పిల్లలకు పోషకాహారం పోషకాహార తల్లిపాలపై అవగాహన , బిఎంఐ బాడీ మసాజ్ ఇండెక్స్ ని ఎలా నిర్ణయించుకోవాలి తెలియజేస్తూ చక్కెర పదార్థాలు ముని పదార్థాలు తక్కువ తీసుకునే విధంగా అవగాహన కల్పించాలి. పోషకాహార నిపుణులు సహాయం తీసుకుని ప్రతిరోజు ఎన్ని క్యాలరీలు పోశాకహారం తీసుకోవాలి. చిరుధాన్యాలు ఏ విధంగా తీసుకోవాలి , వంటల రూపంలో అవగాహన కల్పించాలి మెప్మా వారితో కలిసి పట్టణాల్లో స్వయం సహాయక సంఘాల ద్వారా అవగాహన కల్పించాలి.  జిల్లాలోని కస్తూరిబా పాఠశాలలు, బాలికల వసతి గృహాలు, బాలికల గురుకుల పాఠశాలలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలికలకు రక్తహీనత ఇతర ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సలు అందరికీంచాలని ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు  అదనపు కలెక్టర్ ఆదేశించారు.

పోషణ అభియాన్ కార్యక్రమాన్ని సంబంధిత శాఖల సమన్వయం ద్వారా విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో డి డబ్ల్యుఓ లలిత కుమారి, డీఎం & హెచ్ ఓ నాగ నిర్మల, డిపిఓ సాయిబాబా, జడ్పిసిఓ జానకిరెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ సౌమ్య, జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ నవీన్‌కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *