18/02/2026
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులను స్వీకరిస్తున్న దృశ్యం

Sangareddy News : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ, అందిన ఫిర్యాదులను సత్వరంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా మొత్తం 27 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారులు తమ అర్జీలను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, డి.ఆర్.ఓ పద్మజ రాణి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సమర్పించారు.

ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ, ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి, నిర్దిష్ట కాలపరిమితి లోపల పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించడం ద్వారా ప్రజావాణి కార్యక్రమానికి ఉన్న ప్రాముఖ్యతను నిలబెట్టాలని సూచించారు. అలాగే, జిల్లా సంబంధిత సిఎం ప్రజావాణి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ధిష్ట గడువులోపల తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *