14/04/2026
Untitled design (6)

Sangareddy News : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, హామీల అమలు, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, నిరుద్యోగ భృతి, మరియు పెన్షన్ల వంటి ప్రధాన అంశాలలో విఫలమైందని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు.

ఆదివారం ముబారక్‌పూర్–ఏ, వెల్టూర్, కొనాపూర్, నాగసన్‌పల్లి గ్రామాల్లో రూ. 29 లక్షతో సీసీ రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం నాగ్సన్ పల్లి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ఎండగట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు భరోసా నిధులు, తక్కువ వ్యవధిలో నిరంతర విద్యుత్ సరఫరా, మరియు లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తుందని ఆయన ఆరోపించారు.
రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగలేదని, ఇంకా చాలా మంది రైతులకు రుణమాఫీ కాకుండా నిలిచిపోయిందని అన్నారు.ఇందిరమ్మ ఇళ్లు, నిరుద్యోగ భృతి, మరియు మహిళలకు రూ.2500 నెలవారీ భృతి వంటి పథకాలు అమలు కావడం లేదని, దీనివల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వివరించారు.రైతులకు సకాలంలో రైతు భరోసా, పెట్టుబడి సాయం అందడం లేదని, పంట నష్టపోయిన రైతులకు కూడా పరిహారం అందడం లేదని ఆయన ఆగ్రహించారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోతోందని, ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.


నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని, గత ప్రభుత్వ హయాంలో ఉన్న ఉద్యోగాల భర్తీలో కూడా జాప్యం జరుగుతోందని రాష్ట్రంలో పవర్ కట్స్ పెరిగాయని, రైతులకు వ్యవసాయం కోసం 24 గంటల కరెంట్ సరఫరా కావడం లేదని ఆయన పేర్కొన్నారు.ఈ వైఫల్యాలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు బిఆర్ఎస్ పార్టీ చేపడుతుందని తెలిపారు.
కొనాపూర్ గ్రామానికి చెందిన వార్డ్ సభ్యులు ఆశం, ఆదిల్ ఇద్దరూ గ్రామ సర్పంచ్ అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పెద్దగోల్ల ఆంజనేయులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడిల సుధీర్ రెడ్డి, మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అమరేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ ,ఏఈ కోటేశ్వరరావు, ముబారక్ పూర్ సర్పంచ్ నవీన్ కుమార్, కోనాపూర్ సర్పంచ్ అనిల్ రెడ్డి, వెల్టూర్ సర్పంచ్ కిష్టయ్య, నాగ్సన్పల్లి సర్పంచ్ రవికుమార్, మాజీ సర్పంచ్ లక్ష్మీ చంద్రశేఖర్, బబ్బిలిగామా సర్పంచ్ కృష్ణరెడ్డి, మాజీ సర్పంచ్లు లక్ష్మారెడ్డి,నల్లల కుమార్ ,గడ్డమిది సత్యనారాయణ ,దశరథ్ మాణిక్ రెడ్డి , శ్రీనివాస్ మాజీ ఎంపిటిసిలు శివకుమార్ రాములు నాయకులు శంభు ప్రసాద్ ,హుస్సేన్, శివకుమార్ ,రాందాస్ ,పండరి ,దేవయ్య సంతోష్ జాఫర్ అంజయ్య వినోద్ ఆంజనేయులు ,రవికుమార్ ,జాఫర్ ఆయాగ్రామల ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు కార్యకర్తలు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *