14/04/2026
Sangareddy News

Sadashivpet News : సదాశివపేట మండలంలోని ముబారక్‌పూర్–ఏ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (NREGS) నిధుల ద్వారా మంజూరైన రూ.7 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు శంకుస్థాపన చేశారు. అనంతరం వెల్టూర్ గ్రామంలో రూ.8 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారికి డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పెద్దగొల్ల ఆంజనేయులు, మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, సుధీర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, వెల్టూర్ లక్ష్మారెడ్డి, సర్పంచులు నవీన్ కుమార్, తొంట కృష్ణ తదితరులు, గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *